చేవ్రాతతో
1 కొరింథీయులకు 16:21

పౌలను నేను నా చేతితోనే వందనవచనము వ్రాయుచున్నాను.

కొలొస్సయులకు 4:18

పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయుచున్నాను; నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి. కృప మీకు తోడైయుండును గాక.

అదే గురుతు
2 థెస్సలొనీకయులకు 1:5

దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.

యెహొషువ 2:12

నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి

1 సమూయేలు 17:18

మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రా ధిపతికిమ్ము ; నీ సహోదరులు క్షేమముగానున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.