Now
రోమీయులకు 6:3-5
3
క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణము లోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా ?
4
కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో , ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు , మనము బాప్తిస్మము వలన మరణము లో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు .
5
మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల , ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము .
2 తిమోతికి 2:11

ఈ మాట నమ్మదగినది, ఏదనగా మన మాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.

2 తిమోతికి 2:12

సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.

we believe
యోహాను 14:19

అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.

2 కొరింథీయులకు 4:10-14
10

యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొనిపోవుచున్నాము.

11

ఏలయనగా, యేసుయొక్క జీవముకూడ మా మర్త్యశరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు, సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము.

12

కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి.

13

కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి.

14

కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై,

2 కొరింథీయులకు 13:4

బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమైయున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగలవారము.

కొలొస్సయులకు 3:3

ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.

కొలొస్సయులకు 3:4

మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు.

1 థెస్సలొనీకయులకు 4:14-17
14

యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమి్మనయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

15

మేము ప్రభువుమాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

16

ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు.

17

ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.