Cometh
రోమీయులకు 3:29

దేవుడు యూదులకు మాత్రమే దేవుడా ? అన్యజనులకు దేవుడు కాడా ? అవును , అన్యజనుల కును దేవుడే.

రోమీయులకు 3:30

దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను , సున్నతి లేనివారిని విశ్వాసము ద్వారాను , నీతిమంతులనుగా తీర్చును.

రోమీయులకు 9:23

మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటములయెడల, అనగా యూదుల లోనుండి మాత్రము కాక ,

రోమీయులకు 9:24

అన్యజనము లలో నుండియు ఆయన పిలిచిన మన యెడల , తన మహిమై శ్వర్యము కనుపరచవలెననియున్న నేమి ?

రోమీయులకు 10:12

యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ; ఒక్క ప్రభువే అందరికి ప్రభువైయుండి, తనకు ప్రార్థనచేయువారందరి యెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

రోమీయులకు 10:13

ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును .

రోమీయులకు 15:8-19
8

నేను చెప్పునదేమనగా , పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును , అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకు డాయెను .

9
అందు విషయమై ఈ హేతువుచేతను అన్యజను లలో నేను నిన్ను స్తుతింతును ; నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడియున్నది .
10
మరియు అన్యజనులారా , ఆయన ప్రజ లతో సంతోషించుడి అనియు
11
మరియు సమస్త అన్యజనులారా , ప్రభువును స్తుతించుడి సకల ప్రజలు ఆయనను కొనియాడుదురు గాక అనియు చెప్పియున్నది.
12
మరియు యెషయా యీలాగు చెప్పుచున్నాడు యెష్షయిలోనుండి వేరు చిగురు, అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ; ఆయన యందు అన్యజనులు నిరీక్షణ యుంచుదురు.
13
కాగా మీరు పరిశు ద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తా నందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక .
14
నా సహోదరులారా , మీరు కేవలము మంచివారును , సమస్త జ్ఞాన సంపూర్ణులును , ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను .
15
అయినను అన్యజనులు అను అర్పణ పరిశు ద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికర మగునట్లు , నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి , అన్యజనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడ నైతిని .
16
ఇది హేతువు చేసికొని మీకు జ్ఞాపకము చేయవలెనని యుండి యెక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను .
17

కాగా , క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయకారణము కలదు .

18

ఏలాగనగా అన్యజనులు విధేయులగునట్లు , వాక్యముచేతను , క్రియచేతను , గురుతుల బలము చేతను , మహత్కార్యముల బలము చేతను , పరిశు ద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను .

19

కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగ ప్రకటించియున్నాను .

యెషయా 49:6

నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము ; భూ దిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను.

లూకా 2:32

నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.

గలతీయులకు 3:14

ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.

గలతీయులకు 3:26-28
26

యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులైయున్నారు.

27

క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.

28

ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

ఎఫెసీయులకు 2:11-13
11

కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతిగలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు

12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

13

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు.

ఎఫెసీయులకు 3:8

దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,

కొలొస్సయులకు 3:11

ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.