కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచుకొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
నాచేత పాపము జరిగినయెడల నాతో సమాధానముగా నుండినవానికి నేను కీడుచేసినయెడల
అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలె క్రుంగుచుంటిని.
చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము నాశమునందు పడుటకు జోగుచున్నవారిని నీవు రక్షింపవా?
ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,
మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.
ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను .
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు , అతడు పడియున్నచోటికి వచ్చి
అతనిని చూచి , అతనిమీద జాలిపడి , దగ్గరకుపోయి , నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి , తన వాహనము మీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరమర్శించెను
మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవాని కిచ్చి ఇతని పరామర్శించుము , నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను .
కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువా డాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు --అతని మీద జాలి పడినవాడే అనెను .
అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను .
అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగుచేసెను.
యేసు తండ్రీ , వీరేమి చేయుచున్నారో వీరెరు గరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను . వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి.
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
నరహత్య చేయకూడదు.
నన్ను కనుగొననివాడు తనకే హాని చేసికొనును నాయందు అసహ్యపడువారందరు మరణమును స్నేహించుదురు.
అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీవేల చనిపోదువు?