ఒలీవల వనమనబడిన కొండనుండి
జెకర్యా 14:4

ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పుతట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టువకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపుతట్టునకును సగము కొండ దక్షిణపుతట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ యొకటి యేర్పడును.

మత్తయి 21:1

తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి

మత్తయి 24:3

ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా

మత్తయి 26:30

అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి.

లూకా 21:37

ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను .

లూకా 24:52

వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి

విశ్రాంతిదినమున
లూకా 24:50

ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతు లెత్తి వారిని ఆశీర్వదించెను .

యోహాను 11:18

బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము