యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచునవి కావు నాకు అందనివాటియందైనను గొప్పవాటియందైనను నేను అభ్యాసము చేసికొనుట లేదు.
నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొనియున్నాను సముదాయించుకొనియున్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల్లియొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము నాయొద్ద నున్నది.
చిన్నబిడ్డ వలె దేవునిరాజ్యము నంగీకరింపనివాడు అందులో నెంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పు చున్నానని చెప్పి
నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.