galleries
యెహెజ్కేలు 42:3

ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చప్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.

పరమగీతములు 1:17

మన మందిరముల దూలములు దేవదారు మ్రానులు మన వాసములు సరళపు మ్రానులు.

పరమగీతములు 7:5

నీ శిరస్సు కర్మెలు పర్వతరూపము నీ తలవెండ్రుకలు ధూమ్రవర్ణముగలవి. రాజు వాటి యుంగరములచేత బద్ధుడగుచున్నాడు.

జెకర్యా 3:7

సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - నా మార్గములలొ నడుచుచు నేను నీ కప్పగించినదానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరముమీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును.

with the
యెహెజ్కేలు 41:17

వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.

యెహెజ్కేలు 42:15

అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పు తట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను .