in thine
యెహెజ్కేలు 12:3

నర పుత్రుడా , దేశాంతరము పోవువానికి తగిన సామగ్రిని మూటకట్టుకొని , పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై , నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరియొక స్థలమునకు పొమ్ము; వారు తిరుగుబాటు చేయువారు, అయినను దీని చూచి విచారించుకొందురేమో

సంఖ్యాకాండము 17:6-9
6

కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱల మధ్యనుండెను.

7

మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను.

8

మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను.

9

మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచి యొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.

హొషేయ 12:10

ప్రవక్తల తో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి యున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవక్తల ద్వారా మాటలాడియున్నాను.