ఏలాము
యెషయా 21:2

కఠినమైనవాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడియున్నది. మోసముచేయువారు మోసము చేయుదురు దోచుకొనువారు దోచుకొందురు ఏలామూ, బయలుదేరుము మాద్యా, ముట్టడివేయుము వారి నిట్టూర్పంతయు మాన్పించుచున్నాను.

ఆదికాండము 10:22

షేము కుమారులు ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరామను వారు.

యిర్మీయా 49:35-39
35

ఈలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను.

36

నలుదిశలనుండి నాలుగు వాయువులను ఏలాముమీదికి రప్పించి, నలుదిక్కులనుండి వచ్చు వాయువులవెంట వారిని చెదరగొట్టుదును, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశింపని దేశమేదియు నుండదు.

37

మరియు వారి శత్రువులయెదుటను వారి ప్రాణము తీయజూచువారియెదుటను ఏలామును భయపడజేయుదును, నా కోపాగ్నిచేత కీడును వారి మీదికి నేను రప్పించుదును, వారిని నిర్మూలము చేయువరకు వారివెంట ఖడ్గము పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

38

నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనముచేయుదును; ఇదే యెహోవా వాక్కు.

39

అయితే కాలాంతమున చెరపట్టబడిన ఏలాము వారిని నేను మరల రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

కీరు
యెషయా 15:1

మోయాబును గూర్చిన దేవోక్తి ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును

2 రాజులు 16:9

అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి , దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని , రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.

ఆమోసు 1:5

దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను , ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజ దండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు .

ఆమోసు 9:7

ఇశ్రాయే లీయులారా , మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా ? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను , కఫ్తోరు దేశములో నుండి ఫిలిష్తీయులను , కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని .