ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసికొనుము బలవంతులైన జనులందరిచేతను నా యెదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసికొనుము
కీర్తనల గ్రంథము 44:13-16
13

మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పదముగా చేసియున్నావు మా చుట్టునున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

14

అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

15

నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగతీర్చుకొనువారినిబట్టియు

16

నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

కీర్తనల గ్రంథము 69:9

నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించినవారి నిందలు నామీద పడియున్నవి.

కీర్తనల గ్రంథము 69:19

నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగెనని నీకు తెలిసియున్నది. నా విరోధులందరు నీకు కనబడుచున్నారు.

కీర్తనల గ్రంథము 69:20

నిందకు నా హృదయము బద్దలాయెను నేను బహుగా కృశించియున్నాను కరుణించువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును లేకపోయిరి. ఓదార్చువారికొరకు కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరి.

కీర్తనల గ్రంథము 74:18

యెహోవా, శత్రువులు నిన్ను దూషణచేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనస్సునకు తెచ్చుకొనుము.

కీర్తనల గ్రంథము 74:22

దేవా, లెమ్ము నీ వ్యాజ్యెము నడుపుము అవివేకులు దినమెల్ల నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసికొనుము.

కీర్తనల గ్రంథము 79:10-12
10

వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేల ? మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమునుగూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము .

11

చెరలోనున్నవాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడినవారిని కాపాడుము .

12

ప్రభువా , మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి యెదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము .

రోమీయులకు 15:3

క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొన లేదు గాని నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను . అని వ్రాయబడి యున్నట్లు ఆయనకు సంభవించెను.