యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము
కీర్తనల గ్రంథము 33:18

వారి ప్రాణమును మరణమునుండి తప్పించుటకును కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును

కీర్తనల గ్రంథము 118:4

ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవాయందు భయభక్తులుగలవారు అందురు గాక.

కీర్తనల గ్రంథము 147:11

తనయందు భయభక్తులుగలవారియందు తన కృపకొరకు కనిపెట్టువారియందు యెహోవా ఆనందించువాడైయున్నాడు.

సామెతలు 14:26

యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును

సామెతలు 30:5

దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

అపొస్తలుల కార్యములు 10:35

ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

ప్రకటన 19:5

మరియు -మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.