మంచుగడ్డ యెవని గర్భములోనుండి వచ్చును? ఆకాశమునుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
యోబు గ్రంథము 38:8

సముద్రము దాని గర్భమునుండి పొర్లిరాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు?

యోబు గ్రంథము 6:16

మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుటవలనను అవి మురికిగా కనబడును

యోబు గ్రంథము 37:10

దేవుని ఊపిరివలన మంచు పుట్టును జలముల పైభాగమంతయు గట్టిపడును.

కీర్తనల గ్రంథము 147:16

గొఱ్ఱబొచ్చువంటి హిమము కురిపించువాడు ఆయనే బూడిదవంటి మంచు కణములు చల్లువాడు ఆయనే.

కీర్తనల గ్రంథము 147:17

ముక్కముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు?