నా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును.
యెహోవా , ఎంతవరకు నీవు దాగియుందువు ? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును ?
నీ కోపమువలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతనుబట్టి దిగులుపడుచున్నాము .
నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి?నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?
ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను.ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.
ఆయన నామీద తప్పులు పట్టించుటకు సమయము వెదకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు.
ప్రభువు శత్రువాయెను ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు దాని కోటలను పాడుచేసియున్నాడు యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.