నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు.
నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకునపడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు.
తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు బలముచేత ఎవడును జయము నొందడు .
నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొనియున్నాను నాకు కాలు జారలేదు.
నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా , నీ కృప నన్ను బలపరచుచున్నది .
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.