ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లక మునుపే మీరు అతని కనుగొందురు ; అతడు రాక మునుపు జనులు భోజనము చేయరు ; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి ; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.
యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము ; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును ; ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా
సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను . ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి -సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
అతడు-సమాధానముగానే వచ్చితిని ; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి , యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.
ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యధార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.
అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా ? అది నాకు దూరమగునుగాక ; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా
జ్ఞానములేనివాడు ప్రతి మాట నమ్మును వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును.
బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.
ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు ; వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు .
మీ విధేయత అందరికిని ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను . మీరు మేలు విషయమై జ్ఞానులును , కీడు విషయమై నిష్కపటులునై యుండవలెనని కోరుచున్నాను .